గిద్దలూరు: గిద్దలూరు మండలం బురుజు పల్లి గ్రామంలో బలమైన ఈదురు గాలుల వల్ల చెట్టు నేలకొరిగి గేదె మృతి
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం బురుజు పల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం భారీ ఈదురు గాలులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈదురు గాలులకు ఓ భారీ వృక్షం నేలకొరిగి పక్కనే ఉన్న గేదపై పడింది. దీంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గేద మృతి చెందడం వల్ల రూ.1.50 లక్షలు ఆర్థికంగా నష్టపోయినట్లుగా బాధిత రైతు నర్సిరెడ్డి తెలిపారు. స్థానిక అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.