విశాఖపట్నం: సింహాచలం: 24న వరాహ పుష్కరిణి వద్ద పుణ్యనదీ హారతి.. భక్తులకు ముఖ్య గమనిక!
కార్తీక పౌర్ణమి సందర్భంగా సింహాచలం వరాహ పుష్కరిణిలో పుణ్యనదీ హారతి నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటల తర్వాత స్వామివారి దర్శనం ఉండదని, ఆరాధన సేవా టికెట్లు రద్దు చేశామని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. భక్తులు గమనించగలరు.