దర్శి: దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్సీ నాయకులు
Darsi, Prakasam | Apr 20, 2025 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎస్సీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశ పెట్టడాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీల అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎందుకు సహకరించిన చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎస్సి నాయకులు తెలిపారు.