దర్శి: దర్శిలో రేపు వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సోదరుల ర్యాలీ
Darsi, Prakasam | Apr 22, 2025 దర్శి గంగవరం రోడ్డు వద్ద ఉన్న మసీదులో మంగళవారం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో బుధవారం స్థానికంగా భారీ శాంతియుత ర్యాలీని నిర్వహించనున్నట్లు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీని ముస్లిం సోదరులు విజయవంతం చేయాలని కోరారు.