దర్శి: దర్శి నియోజకవర్గంలో ఘనంగా ఈష్టర్ పండుగ వేడుకలు నిర్వహణ
Darsi, Prakasam | Apr 20, 2025 దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు, దొనకొండ, తాళ్లూరు,కురిచేడు మండలాల్లో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఆదివారం క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్లు ఏసుప్రభు యొక్క వాక్యోపదేశం చేశారు. సమస్త మానవాళి పాపాల కోసం ఏసు క్రీస్తు సిలువ వేయబడి మూడవ రోజు పునరుద్ధానుడై తిరిగి సమాధిలో నుంచి లేచారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు మార్గంలో నడవాలని ఆయన సూచించారు