దర్శి: దర్శిలో ఘనంగా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
Darsi, Prakasam | Apr 20, 2025 దర్శిలో ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడి 75వ పుట్టినరోజు వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.. ఎన్టీఆర్, నారపుశెట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.