మార్కాపురం: గోగులదిన్నె గ్రామంలో నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోని సచివాలయ విలేజ్ క్లినిక్ భవనాలు
మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామానికి చెందిన గ్రామ సచివాలయం, విలేజ్ క్లినిక్ భవనాల నిర్మాణం పూర్తయింది. కానీ ప్రారంభానికి నోచుకోలేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సచివాలయ భవన నిర్మాణానికి 40 లక్షలు, విలేజి క్లినిక్ భవన నిర్మాణానికి 17.50 లక్షల నిధులతో పూర్తి చేశారు. కానీ ప్రారంభానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. లక్షల రూపాయల నిధులు ప్రయోజనం లేకుండా పోతుందని ప్రజలు వాపోయారు. వెంటనే వాటిని ప్రారంభించాలని కోరారు.