యర్రగొండపాలెం: రాజంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన గొడ్రాలు కొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన గొడ్రాలు కొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతానం లేని వారు, ఆరోగ్యం బాగా లేని వారు పొంగళ్ళు తయారు చేసుకొని స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. కోరిన కోరికలు నెరవేరడంతో భక్తులు ప్రతివారం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. భజన, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.