కొండపి: గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఒంగోలులో శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన మంత్రి.. గంజాయి మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీసు అధికారులు గంజాయి తరలింపు అంటే అంశాలపై నిగా పెట్టారని గంజాయి నిర్మూలించేందుకు కార్డెన్ సర్చీలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత కూడా బాగా చదువుకొని దేశానికి ఉపయోగపడాలని మంత్రి సూచించారు.