కొండపి: సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం, విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్న ఆలయం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 4 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా రాత్రివేళ ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించగా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించే విధంగా ఆధ్యాత్మిక శోభతో ఆలయం ప్రకాశిస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు.