కొండపి: సింగరాయకొండ మండలం శానంపూడి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కృష్ణ అనే వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తు అదుపుతప్పి క్రిందపడి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్లు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.