కొండపి: సింగరాయకొండ మండలంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని త్వరగా పూర్తి చేస్తామని తెలిపిన చైర్మన్ శ్రీనివాసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ మండలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామని చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపాన్ని పరిశీలించిన ఆయన అతి త్వరలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. సభ్యులతో కలిసి పరిశీలించి దాతల సహకారంతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే కొంత మేరకు కళ్యాణ మండపం నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు.