తాడిపత్రి: తాడిపత్రిలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
తాడిపత్రి పట్టణంలో శనివారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా గ్రంధాలయ కన్వీనర్ పోతుల గంగాధర్ యాదవ్, జిల్లా చేనేత కన్వీనర్ నారాయణస్వామి లు కార్యకర్తలతో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలన కోసం నిరంతరం జ్యోతిరావు పూలే పోరాటం చేశారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పూలేను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.