మార్కాపురం: సకాలంలో స్పందించి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన మార్కాపురం పోలీసులు
మార్కాపురంలో నివాసం ఉంటున్న బండి రామదాసు కుటుంబ సమస్యల కారణంగా సోమవారం సాయంత్రం తను చనిపోతున్నానని చెప్పి కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తమ స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న డీఎస్పీ సీఐ ఆదేశాల మేరకు ఎస్సై వేమన సిబ్బంది ఐటి కోర్ టీం సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రామదాసు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. వెంటనే రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని అతని ప్రాణాలను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సిఐ ఆల్తాఫ్ హుస్సేన్ తెలిపారు.