కొండపి: మరిపూడి మండలం చిమ్మటలో పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని చిమట గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 14 మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసి రూ.16,770 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే 100 లేదా 112 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.