కొండపి: ఉమ్మడి జిల్లాలో శక్తి యాకుపై మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు, యాప్ ని డౌన్లోడ్ చేయించిన అధికారులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శుక్రవారం పోలీసులు మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్టాండ్ లో రైల్వే స్టేషన్లో ప్రధాన సెంటర్లు పాఠశాలలు ప్రాంతాలలో శక్తి యాప్ పై అవగాహన కల్పించి యాప్ ని డౌన్లోడ్ చేయించారు. అత్యవసర సమయంలో మహిళలు ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించినట్లయితే పోలీసులు వారి వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని పోలీసులు మహిళలకు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ శక్తి ఆప్ డౌన్లోడ్ చేయించుకోవాలని అలానే రాష్ట్ర ప్రభుత్వ ఈ యాప్ ని మహిళల కోసం రూపొందించింది అని పోలీసులు తెలిపారు.