రాయదుర్గం: ఈనెల 13 సాయంత్రం లోపు ఎన్యుమరేషన్ ఫారాలు బిఎల్ఓ లకు అందజేయాలి : రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి
ఈనెల 13 వ తేదీ సాయంత్రం లోపు ఎన్యుమరేషన్ ఫారాలు బిఎల్ఓ లకు అందజేయాలని, అలా చేయకపోతే ఓటు కోల్పోయే ప్రమాదం ఉందని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలియజేశారు. గురువారం రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కు పట్టణంలోని ప్రతీ ఓటరు బిఎల్ఓ లతో సహకరించాలని కోరారు. మున్సిపల్ ఆఫీస్ లో హెల్ఫ్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. అక్కడ కూడా ఫారాలు తగిన సమాచారంతో ఇవ్వవచ్చని వివరించారు.