గిద్దలూరు: కంభం పట్టణంలో కుక్కను తప్పించే క్రమంలో బోల్తా పడ్డ ఆటో, ముగ్గురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో కుక్కను తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడ్డ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో మొత్తం ముగ్గురు గాయపడగా వారిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కింద పడ్డవారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.