తాడిపత్రి: యాడికి లోని వేములపాడు రోడ్డులో సీఎం హేలీ ప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, అధికారులు
యాడికి కి ఈనెల ఆరో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేములపాడు రోడ్డులోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్ స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు శనివారం పరిశీలించారు. హేలీ ప్యాడ్ స్థలంతో పాటు సభ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని కూడా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటును పక్కాగా చేయాలని స్థానిక అధికారులను డీఎస్పీ ఆదేశించారు.