యర్రగొండపాలెం: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చూస్తుంటే జగన్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపిన మంత్రి నిమ్మల రామానాయుడు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే జగన్ రప్పా రప్పా అంటూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా గమనించి ఇలాంటి నాయకులను తిరస్కరించాలని కోరారు.