కొండపి: సింగరాయకొండ మండలంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియో రికార్డింగ్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి వెలుగు చూసింది. ఆదివారం ఉపాధి కూలీ తన ఆవేదన వ్యక్తం చేస్తున్న ఒక ఆడియో రికార్డింగ్ వైరల్ గా మారింది. మజ్జిగ మంచినీరు పంపిణీ చేయకపోగా తమ వద్ద నుంచి వారానికి వంద రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆ ఆడియో రికార్డింగ్లో మాట్లాడుతున్న వ్యక్తితో విషయం బయటికి వచ్చింది. దీంతో స్థానికంగా ఈ ఆడియో సంచలనంగా మారింది. ఉపాధి హామీ పథకంలో కొద్దిగా రోజులుగా అవినీతి వెలుగు విషయం తెలిసిందే.