విశాఖపట్నం: జీవీఎంసీలో పెరిగిన వార్డులు: 98 నుంచి 120కి పెంపు - గెజిట్ నోటిఫికేషన్ విడుదల
జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన పూర్తి. ఇప్పటివరకు ఉన్న 98 వార్డులను 120 వార్డులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనాభాకు అనుగుణంగా పౌర సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జోన్ల వారీగా వార్డుల సరిహద్దుల పట్టికను జీవీఎంసీ అందుబాటులో ఉంచింది.