తాడిపత్రి: టీడీపీ మాజీ కౌన్సిలర్లు సీఐటీయూ యూనియన్ పై ఆరోపణలు చేయడం దారుణం: తాడిపత్రిలో సీఐటీయూ మండల కార్యదర్శి నరసింహారెడ్డి
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు సీఐటీయూ యూనియన్ పై ఆరోపణలు చేయడం దారుణమని సీఐటీయూ తాడిపత్రి మండల కార్యదర్శి నరసింహారెడ్డి అన్నారు. తాడిపత్రిలో గురువారం ఉదయం 11.40 గంటల సమయంలో ఆయన మండల అధ్యక్షులు ఉమా గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. యూనియన్ పైనే ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మున్సిపల్ అధికారి సచివాలయ, మున్సిపల్ మహిళా ఉద్యోగులను వేధిస్తుండడంతో మున్సిపల్ వర్కర్స్ సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగిందన్నారు. మహిళా ఉద్యోగులను వేధిస్తున్న అధికారిపై మాట్లాడకుండా యూనియన్ పై, యూనియన్ నాయకులపై ఆరోపణ చేయడం తగదన్నారు.