తాడిపత్రి: ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చిరస్మరణీయుడు: పెద్దపప్పూరు లో ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ
ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చిరస్మరణీయుడు, సేవా తత్పరుడు అని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ అన్నారు. పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలను సీడీసీ, మహిళా సంఘాల సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరూ ఫెర్రర్ ను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.