రాయదుర్గం: పెట్రోలు డీజిల్ ధరలు ఉపసంహరించుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన
పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రాయదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్, సిఐటియు నాయకులు కలసి రోడ్డు పై నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని సిఐటియు నాయకులు మల్లికార్జున మండిపడ్డారు. ధరలు తగ్గించేవరకూ ఉద్యమిస్తామని తెలిపారు.