రాయదుర్గం: పట్టణంలోని ముస్లిం యువకుల ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ, ఘన నివాళులు
రాయదుర్గంలో ముస్లిం యువకులు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటాలు, జాతీయ జెండా లు చేతబట్టి నీలి కండువాలు ధరించిన యువకులు అంబేడ్కర్ ఆశయాలను సాధిస్తామంటూ పెద్ద ఎత్తున నినదించారు. మొలకల్మూరు రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముస్లిం యువకులు పెద్దఎత్తున అంబేడ్కర్ జయంతి జరుపుకోవడం సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.