రాయదుర్గం: బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపులాపురం గ్రామానికి చెందిన బాలుడు దుర్మరణం
కణేకల్లు మండలం గోపులాపురం గ్రామానికి చెందిన నిషాంత్ (7) అనే బాలుడు బెంగళూరు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. చిన్నమారెన్న, శాంతి దంపతులు బెంగళూరులో నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 2 వ తరగతి చదువుతున్న నిషాంత్ సైకిల్ పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన టెంటో డీకొని చక్రాల కిందపడి మరణించాడు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం స్వగ్రామానికి తీసుకురాగా కుటుంబ సభ్యులు గ్రామస్తులు బోరున విలపించారు.