గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భావితరాలకు ఆశాజ్యోతి లాంటి వారిని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఇచ్చారని అలానే వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుంటుందని అన్నారు.