రాయదుర్గం: దేవగిరి గ్రామంలో వడదెబ్బ నివారణ పై అవగాహన కల్పించిన వైద్యాధికారి
బొమ్మనహాల్ మండలంలోని దేవగిరి గ్రామంలో వడ దెబ్బ నివారణ జాగ్రత్తల పై బొమ్మనహాల్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ చల్లా శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. వేసవి ఎండలు తీవ్రతరం అవుతుండటంతో ప్రజలకు వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. పొలం పనులకు వెళ్ళేవారు త్వరగా పనులుముగించుకుని ఇంటివద్దకు చేరుకోవాలని, బిపి, షుగర్ ఉన్న వారు, 65 ఏళ్లు పైబడిన వారు, గర్భవతులు, పాలిచ్చు తల్లులు, చిన్నపిల్లలు ఎండకు తిరగకుండా ఉండాలని సూచించారు. రోజూర15 గ్లాసుల నీరు, మజ్జిగ తీసుకోవడం అవసరం అని వివరించారు. సి హెచ్ ఓ ఈశ్వరయ్య పిహెచ్ఎన్ చిలకమ్మ పాల్గొన్నారు.