మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల యువకులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల యువకులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 2026 జూలై నాటికి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన సుమారు 400 మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.