రాయదుర్గం: రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కి కృషి మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి :
రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ రాయదుర్గం మార్కెట్ యార్డ్ లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు కమిటీ చైర్మన్ గొడిశలపల్లి హనుమంతరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ లో ఆయన అద్యక్షతన కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం వైస్ చైర్మన్ దానవేంద్ర, కార్యదర్శి శ్రీనివాసులు, డైరెక్టర్లతో కలసి రూ.49 లక్షలతో చేపట్టిన వాణిజ్య సముదాయ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఎద్దుల సంత, కూరగాయల హోల్ సేల్ మార్కెట్, రైతుల విశ్రాంతి భవనం తదితర అంశాలపై తీర్మానాలు చేసినట్లు మీడియాకు వెల్లడించారు.