మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరుకు చెందిన రైతు దుగ్గెంపూడి వెంకటరెడ్డి పాము కాటుకు గురై మృతి చెందారు. పాముకాటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ గుంటూరులో ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.