రాయదుర్గం: కాంగ్రెస్ లో చేరిన పలువురు యువకులు, సాదరంగా ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్చార్జ్ గౌని ప్రతాపరెడ్డి
రాయదుర్గం పట్టణానికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్చార్జ్ గౌని ప్రతాపరెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై వీరు కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. గోపీనాథ్, రామచంద్ర, కాలిక్, గోనబావి తిప్పేస్వామి, నయాజ్, ఇస్మాయిల్, హరిజన వన్నూరు స్వామి, అల్లా బకాస్ తదితరులు చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఊరువాకాలి అనిల్ కుమార్, జయన్న, వసంత గౌడ్, లోకనాథ్ రెడ్డి పాల్గొన్నారు.