మార్కాపురం: జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రామిరెడ్డి వర్ధంతి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాచురి రామిరెడ్డి వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ నేత రామిరెడ్డి ఉపాధ్యాయ హక్కులను పరిరక్షించడంలో అనేక పోరాటాలు చేశారన్నారు. మహిళా రిజర్వేషన్ డి లిమిటేషన్ గురించి మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ పై 2023లోని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కానీ అమలు చేయకుండా డీ లిమిటేషన్ తో కలిపి మహిళా రిజర్వేషన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టడంతో ప్రతిపక్షాలు వ్యతిరేకించారు.