కొండపి: పొన్నలూరు మండలం బోధనంపాడు సమీపంలో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం బోధనంపాడు గ్రామ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అదే ద్విచక్ర వాహనంపై ఉన్న ఓ చిన్నారి మృతి చెందగా చిన్నారి తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట వీరిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలించగా చిన్నారి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చిన్నారి తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.