రాయదుర్గం: వడదెబ్బ నివారణ చర్యలపై బొమ్మనహాల్ లో అవగాహన కల్పించిన వైద్యాధికారులు
బొమ్మనహాల్ మండల కేంద్రంలో వడ దెబ్బ నివారణ జాగ్రత్తల పై బొమ్మనహాల్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ చల్లా శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కల్పించారు. వేసవి ఎండలు తీవ్రతరం అవుతుండటంతో ప్రజలకు వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. పొలం పనులకు వెళ్ళేవారు త్వరగా పనులుముగించుకుని ఇంటివద్దకు చేరుకోవాలని, బిపి, షుగర్ ఉన్న వారు, 65 ఏళ్లు పైబడిన వారు, గర్భవతులు, పాలిచ్చు తల్లులు, చిన్నపిల్లలు ఎండకు తిరగకుండా ఉండాలని సూచించారు. రోజూర15 గ్లాసుల నీరు, మజ్జిగ తీసుకోవడం అవసరం అని వివరించారు. సి హెచ్ ఓ ఈశ్వరయ్య పిహెచ్ఎన్ చిలకమ్మ ,అర్యోగ కార్యకర్తలు గోవర్ధన్ ,రమాదేవి