కళ్యాణదుర్గం: సరైన రికార్డు లేని 30 ద్విచక్ర వాహనాలు, మూడు ట్రాక్టర్లను సీజ్ చేశాం: కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు
కళ్యాణదుర్గం అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్ ల పరిధిలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా పోలీసులు వజ్ర ప్రహార్ ఆపరేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో సీఐలు హరినాథ్, నీలకంఠ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది అనుమానితులు, పాత నేరస్తుల ఇళ్లను సోదా చేశారు. వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం డీఎస్పీ రవి బాబు మాట్లాడారు. సరైన రికార్డు లేని 30 ద్విచక్రవాహనాలతో పాటు మూడు ట్రాక్టర్లను సీజ్ చేశామన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదన్నారు. ఒకవేళ నడిపితే వారి తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.