రాయదుర్గం: నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
రాయదుర్గం నియోజకవర్గంలోని పలు వైష్ణవ దేవాలయాలు, ఆంజనేయస్వామి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం, సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, మురడి, నేమకల్లు ఆంజనేయస్వామి దేవాలయాలకు శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దేవతా మూర్తులను దర్శించుకున్నారు. ఆయా ఆలయాలలో అర్చకులు అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మురడి, నేమకల్లు లో వెండికవచ అలంకారంలో ఆంజనేయస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు.