గిద్దలూరు: గిద్దలూరు గాంధీ బజార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గాంధీ బజార్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పెన్షన్లను పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల సీఎం చంద్రబాబు ఒకటవ తేదీ కల్లా లబ్ధిదారులకు ఇండ్ల వద్దకే పెన్షన్లు తీసుకువచ్చి పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారని అన్నారు.