మార్కాపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించే సమయాలలో మార్పు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధించిన సమయాలలో మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత ప్రకటనలో తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మే నాలుగో తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి నిర్ణయిత సమయానికి హాజరై తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలని సూచించారు.