దర్శి: దర్శి జూనియర్ కళాశాలలో దర్శనాపురి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన
Darsi, Prakasam | May 25, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని జూనియర్ కళాశాలలో దర్శనాపురి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజజీవితంలో కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలు ప్రేక్షకులను కంటతడి పెట్టే దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో మూడు రోజులపాటు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.