మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం నుండి పల్స్ పోలియో అవగాహన ర్యాలీ
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం నుండి పల్స్ పోలియో అవగాహన ర్యాలీ కార్యక్రమంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ కే పద్మావతి పాల్గొని జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆర్డీవో కార్యాలయం నుండి కంభం సెంటర్ వరకు నిండు జీవితానికి రెండు చుక్కలు పల్స్ పోలియో చుక్కలు ఇప్పించండి అంటూ అవగాహన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాలలోపు ప్రతి ఒక్కరు పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు.