రాయదుర్గం: జొన్న కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి : బొమ్మనహాల్ ఏఓ సాయికుమార్
బొమ్మనహాల్ మండలంలో బుధవారం జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు బొమ్మనహాల్ మండల వ్యవసాయాధికారి సాయి కుమార్ తెలియజేశారు. మండలంలోని బొల్లనగుడ్డం, సిద్దరాంపురం, హరేసముద్రం, కురువళ్ళి తదితర గ్రామాల పరిధిలో 2080 హెక్టార్లలో జొన్న సాగైందన్నారు. క్వింటాలుకు రూ 3699 ధరతో రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేస్తామన్నారు. మంగళవారం జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రమేష్ రెడ్డి, కణేకల్లు స్టాక్ పాయింట్ ఆఫీసర్ సుధాకర్, టెక్నికల్ అసిస్టెంట్ ముఖేష్, ఉద్దేహాల్ సొసైటీ చైర్మన్ కొత్తపల్లి మల్లికార్జున తో కలసి నిల్వ గోడౌన్ లను పరిశీలించారు.