గిద్దలూరు: బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ గుండెపోటుతో మృతి
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాజేంద్రప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. ముందురోజు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కొద్దిగా రోజులకు అనారోగ్య సమస్యలతో తిరుమల శెట్టి రాజేంద్రప్రసాద్ బాధపడుతున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. ఆయన మృతి పై పోలీసు సిబ్బందితో పాటు సిఐలు ఎస్సైలు సంతాపం తెలిపారు.