మార్కాపురం: మాదాలవారిపాలెంలో గాలివాన బీభత్సం సృష్టించడంతో కూలిపోయిన కోళ్ల ఫారం షెడ్డు
మార్కాపురం జిల్లా పొదిలి మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో మాదాలవారిపాలెం సమీపంలోని పొలాలలో ఉన్న కోళ్ల ఫారం షెడ్డు కూలిపోయింది. సుమారు అందులో ఉన్న 40 కోళ్లు షెడ్డు కింద పడిపోయి చనిపోయాయి. జీవనోపాధి కోసం షెడ్డును ఏర్పాటు చేసుకొని కోళ్లు పెంచుకుంటున్న ఈ సమయంలో ఇలా జరగడం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని బాధితుడు వాపోయారు.