యర్రగొండపాలెం: కొత్తపల్లిలో జనగణన సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న జన గణన ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. పెద్దారవీడు మండలం కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న ఇంటింటి సర్వేను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని ప్రజలకు పలు విషయాలను సూచించారు. జనగణలో భాగంగా ఎన్యూమరేటర్లు ఇంటి వద్దకు వస్తారని మొబైల్ యాప్ లో మీ ఇంటి సర్వే చేస్తారని వారు అడిగిన వివరాలు తెలియజేసి సహకరించాలని తెలిపారు. అంతకుముందు దేవరాజు గట్టు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్లను సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలని సిబ్బంది కి సూచించారు.