కొండపి: జిల్లాలోని పాఠశాలలు విద్యాలయాలలో శక్తి యాప్ పై విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, పాఠశాలలు, గురుకుల పాఠశాలలలో పోలీసులు విద్యార్థినిలకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అలానే పోక్సో చట్టంపై అవగాహన కల్పించి శక్తి వ్యాప్ వల్ల కలుగు ప్రయోజనాలను వివరించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళ స్మార్ట్ఫోన్లో శక్తి యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని అలానే అత్యవసర సమయంలో యాప్ ద్వారా పోలీసులను సంప్రదించినట్లయితే పోలీసులు వారి వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని పోలీసులు చెప్పారు.