దర్శి: దర్శి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కు ఘన నివాళులర్పించిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి
Darsi, Prakasam | May 28, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. భారీ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. అనంతరం రెండో రోజు వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిగ్ స్క్రీన్ లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షించారు.