మార్కాపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 204 అర్జీలు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత వెల్లడి
మార్కాపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 204 అర్జీలు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. వీటిలో రెవెన్యూ సంబంధించిన 126, ఇతర సమస్యలపై 78 అర్జీలు వచ్చాయ కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే ప్రజలు వస్తున్నారని ఈ ధోరణి అరికట్టా లంటే భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ఒక్కటే మార్గం అన్నారు. ఇకనుంచి ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.