దర్శి: రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ దర్శి ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి
Darsi, Prakasam | May 31, 2026 నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో ఏర్పాటుచేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి విగ్రహం తలను పగలగొట్టిన ఘటనను రాష్ట్ర అసాంఘిటితా కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ పార్టీ చైర్మన్ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి వెంకట కృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మహానేత రాజశేఖర్ రెడ్డి విగ్రహం పై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.